Instagram | మీ అనుమతి లేకుండానే మీ రీల్స్ ఏఐ చేతికి!

ఆంధప్రభ, వెబ్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్‌ కోసం సరికొత్త అప్డేట్‌ ను తీసుకువచ్చింది. మోటా సంస్థ తీసుకువచ్చిన ‘న్యూ మ్యూజ్ ఇమేజ్ మోడల్’ (New Muse Image Model) అనే ఈ (ఏఐ)AI ఫీచర్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఫీచర్‌ చాలా అధ్బుతంగా ఉందని భావించినా.. అంతే స్థాయిలో వినియోగదారుల ప్రైవసీపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.

‘మ్యూస్ ఇమేజ్’ ఫీచర్ అంటే ఏంటి?

ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ అకౌంట్ (Public Account) ఉన్న వినియోగదారుల ప్రొఫైల్స్ ఈ ఫీచర్‌లో ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయిపోతాయి. దీనివల్ల ఎవరైనా సరే ఒక ప్రాంప్ట్ రాసేటప్పుడు మీ యూజర్‌నేమ్‌ను @ ట్యాగ్ చేసి, మీ అకౌంట్లో ఉన్న ఫోటోలను, రీల్స్ (Reels) ఆధారంగా ఏఐ చిత్రాలను సృష్టించవచ్చు. మీ అనుమతి లేకుండానే మీ కంటెంట్‌ను ఇతరులు ఏఐ ఇమేజ్ జనరేట్‌ చేసి ఉపయోగించుకునే అవకాశం ఈ ఫీచర్ కల్పిస్తుంది.

‘మ్యూస్ ఇమేజ్’ ఫీచర్ తో లాభం..

-‘మ్యూస్ ఇమేజ్’ ఫీచర్ తో క్షణాల్లో హై-క్వాలిటీ చిత్రాల సృష్టించవచ్చు. యూజర్‌ తమకు కావలసిన ఫోటోలను కేవలం ఒక్క (Prompt)తో టైప్ చేసి హై-క్వాలిటీ ఏఐ చిత్రాలను క్షణాల పొందవచ్చు.

-అయితే ఈ ఫీచర్ నేరుగా మెటా ప్లాట్‌ఫామ్‌ అయినా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెటా ఏఐ యాప్ అందుబాటులో ఉండటంతో క్రియేట్ చేసిన ఫోటక్షలను డౌన్‌లోడ్ చేసుకొని నేరుగా స్టోరీలు, ఫీడ్‌, చాట్‌ తో స్నేహితులతో పంచుకోవచ్చు.

-ఏదైనా ఈవెంట్ లేదా పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేకమైన ఇన్విటేషన్ కార్డ్స్ డిజైన్ చేసుకోవచ్చు.

-వ్యాపార ప్రకటనలు లేదా ప్రాజెక్ట్‌ల కోసం కొత్త ఐడియాలను విజువల్స్ రూపంలో నమూనా (Prototype) చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

-ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్‌నేమ్‌ను @-ట్యాగ్ చేసి, ఆ ఖాతాలోని ఫోటోల ఆధారంగా సరికొత్త విజువల్స్ క్రియేట్ చేయవచ్చు

మీ ఫోటోలు ఏఐ చేతికి చిక్కకుండా ఉండాలంటే..?

మీ అకౌంట్‌ లోని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు, రీల్స్ ఇతరుల చేతిలో ఏఐ (AI) కంటెంట్‌గా మారకుండా ఉండాలంటే టెక్ నిపుణులు ముఖ్యమైన రెండు మార్గాలను సూచిస్తున్నారు.

అకౌంట్‌ను ‘ప్రైవేట్’ (Private) గా మార్చడం..

మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను పబ్లిక్ నుండి ప్రైవేట్‌గా మార్చడం. దీనివల్ల మిమ్మల్ని ఫాలో అయ్యే సన్నిహితులు తప్ప వేరే ఎవరూ మీ ఫోటోలను చూడలేరు, అలాగే ఏఐ టూల్స్ కూడా మీ డేటాను యాక్సెస్ చేయలేవు.

ఒకవేళ మీరు మీ అకౌంట్‌ను పబ్లిక్‌గానే ఉంచాలనుకుంటే, క్రింది సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ కంటెంట్‌ను ఇతరులు రీ-యూజ్ చేయకుండా అడ్డుకోవచ్చు..

-ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ Settings లోకి వెళ్ళండి.

-అక్కడ ‘Sharing and Reuse’ (షేరింగ్ అండ్ రీ-యూజ్) ఆప్షన్‌ను ఎంచుకోండి.

-అందులో మీ పోస్టులు, రీల్స్‌కు సంబంధించిన అనుమతులను Disable (డిజేబుల్) చేయండి.