Kavitha Manuguru Visit | కవిత మణుగూరు పర్యటన ఉద్రిక్తం

ఓసీపీ సందర్శనపై పోలీసుల అడ్డుకట్ట
పీకే ఓసీపీ–2 సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం
పోలీసుల తీరుపై పార్టీ నేతలు, కార్మిక సంఘాల ఆగ్రహం
సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్న కల్వకుంట్ల కవిత

Kavitha Manuguru Visit |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శుక్రవారం టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణుగూరులోని పీకే ఓసీపీ–2 (PK OCP-2) గనిని సందర్శించేందుకు వెళ్లిన కవితను పోలీసులు అడ్డుకున్నారు. గని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు.

దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై కవితతో పాటు ఉన్న పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం కవిత గని ప్రాంతంలోకి వెళ్లి సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, డిమాండ్లు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి కార్మికులకు కవిత సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. కార్మికులు ధైర్యంగా ఉండండి, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. మెడికల్ బోర్డు నెలకు రెండుసార్లు పెట్టకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని నేను హెచ్చరించాను. కార్మిక యూనియన్లతో 15, 18 తారీఖుల్లో మెడికల్ బోర్డు పెడతామంటూ లీకులు ఇస్తున్నారు, మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారన్నది సింగరేణి యాజమాన్యం స్పష్టత ఇవ్వాల‌ని క‌విత డిమాండ్ చేశారు.