Tea Break | సాయి సుద‌ర్శ‌న్ (81) ఔట్‌

Tea Break | సాయి సుద‌ర్శ‌న్ (81) ఔట్‌

క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (81), గిల్‌

Tea Break | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీ సమయానికి భారత్ 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (137 బంతుల్లో 81) పట్టుదలతో క్రీజులో నిలవగా, సాయి సుదర్శన్ (81) కీలకమైన అర్ధశతకం సాధించి ఔటయ్యాడు. ప్రస్తుతం రాహుల్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 20) క్రీజులో ఉన్నాడు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్న సాయి సుద‌ర్శ‌న్, మ‌హ్మ‌ద్ స‌లీ బౌలింగ్‌లో అఫ్స‌ర్ జ‌జాయ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట‌య్యాడు.

Leave a Reply