పశువులకు ఎల్ఎస్డీ టీకాలు తప్పనిసరిగా వేయించాలి
- సర్పంచ్ ఎం. సునీత మాధవ్ సింగ్
కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఎల్ఎస్డీ (లంపీ స్కిన్ డిసీజ్) ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని బాబా నాయక్ తాండా సర్పంచ్ ఎం. సునీత మాధవ్ సింగ్ పశువుల యజమానులు, రైతులకు సూచించారు.
శుక్రవారం కడెం మండలంలోని బాబా నాయక్ తాండాలో నిర్వహించిన ఎల్ఎస్డీ టీకాల కార్యక్రమంలో సర్పంచ్ ఎం. సునీత మాధవ్ సింగ్ పాల్గొని పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముందుజాగ్రత్త చర్యగా పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేయించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.
ప్రతి పశువుల యజమాని తమ పశువులకు తప్పనిసరిగా ఎల్ఎస్డీ టీకాలు వేయించి వాటి ఆరోగ్యాన్ని కాపాడాలని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అల్లంపల్లి ఎల్ఎస్ఏ హరీష్, రైతులు, పశువుల యజమానులు పాల్గొన్నారు.
