రెండో విడతలో 59 ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు.. ఎమ్మెల్యేకు గ్రామస్థుల కృతజ్ఞతలు

రామచంద్రపురంలో నూతన ఇంద్రమ్మ ఇంటి ప్రారంభోత్సవం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు పిలుపు

మహబూబ్‌నగర్ రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇంటిని గ్రామ సర్పంచ్ వై. నర్సిములు (బాబురావు) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు రెట్టింపు ఉత్సాహంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రెండో విడత కింద గ్రామానికి 59 ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామంలో మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారుడు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశవానంద్, వార్డు సభ్యులు కవిత, అలివేలు, శ్రీశైలం, గ్రామ కమిటీ అధ్యక్షుడు కురువ ఆనంద్ (బిన్నీ), ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వీరన్న, రాఘవేంద్ర గౌడ్, నాయకులు రాజు, నర్సింలు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.