పేద విద్యార్థినికి కాకతీయ ఫౌండేషన్ చేయూత అభినందనీయం…
సీఐ వైవివిఎల్ నాయుడు
కంచికచర్ల, ఆంధ్రప్రభ : ఉన్నత చదువుల నిమిత్తం పేద విద్యార్థినికి కాకతీయ ఫౌండేషన్ నిర్వాహకులు చేయూతనివ్వడం అభినందనీయమని రూరల్ సిఐ వైవివిఎల్ నాయుడు అన్నారు. కంచికచర్ల మండల పరిధిలోని మున్నలూరు గ్రామానికి చెందిన రాయల శ్వేత ఉన్నత విద్య కొరకు కాకతీయ ఫౌండేషన్ సమకూర్చిన 25 వేల రూపాయలను సిఐ వైవివిఎల్ నాయుడు, శ్వేతాకు గురువారం సీఐ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండల స్థాయిలో అనేక ఉచిత సేవా కార్యక్రమాలు చేపడుతున్న కాకతీయ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఉన్నత చదువులు చదివి శిఖరాలు చేరుకోవాలని, పట్టుదలతో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని, దాతల సహాయం సద్వినియోగం చేసుకోవాలని శ్వేత ను కోరారు. కాకతీయ ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ఫౌండేషన్ అట్లూరి రాఘవ, మలినేని వాసు పాల్గొన్నారు.
