CM Revanth Reddy | తాత–మనవడి మధుర క్షణాలు..
CM Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడితో గడిపిన ఆప్యాయ క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మనవడి కోరిక మేరకు స్వయంగా పూరీలు చేస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

వీడియోను పంచుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి.. ‘‘తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు.. చేతిలో పిడికెడు పిండి.. దోసిట్లో నవ్వులు.. గుండ్రంగా లేని డజన్ పూరీలు. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’’ అంటూ భావోద్వేగంగా రాశారు.
ప్రజా కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. మనవడి కోసం పూరీలు చేస్తూ కనిపించిన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ అనుబంధాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
