ఓటు హక్కును కాపాడుకోవాలి

కడెం, ఆంధ్రప్రభ: ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న పిలుపునిచ్చారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు స్థానిక సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని, ప్రతి అర్హుడైన ఓటరు తమ పేరును ఓటరు జాబితాలో ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.

ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొని తమ ఓటును కాపాడుకోవాలని కోరారు. అనంతరం గ్రామస్తులకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపే విధానంపై అవగాహన కల్పించి, అవసరమైన వారికి సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో కడెం మండల బీసీ సెల్ అధ్యక్షుడు ముంజా ప్రసాద్ గౌడ్, బీఎల్ఓ లక్ష్మి, బీఎల్ఏ గంధం ఉదయ్, అంగన్‌వాడీ టీచర్ సుమలత, ఉప సర్పంచ్ ఆనంద్, ప్రేమ్ కుమార్, శేఖర్, గంగన్నతో పాటు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.