ఐటీడీఏ పీఓను కలిసిన న్యాయవాదులు
ఐటీడీఏ పీఓను కలిసిన న్యాయవాదులు
ఉట్నూర్, ఆంధ్రపభ: ఉట్నూర్ ఐటీడీఏ నూతన పీవో గా బాధ్యతలు స్వీకరించిన మంద మకరంద ను ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు భానోత్ జగన్నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పలు విషయాలపై పిఓ గారితో చర్చించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమకు పిఓ సూచనలు, సలహాలు ఇచ్చారని ఆయన తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఉట్నూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బానోత్ జగన్ నాయక్, ఉపాధ్యక్షులు వసంత్ రావు, జైవంత్ రావ్ జనరల్ సెక్రటరీ, కూడలి అశోక్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాదులు బాపు రెడ్డి, జమీర్ ఖాన్, లచ్చన్న, చింతల గిరి, పెందుర్ ప్రభాకర్, లక్ష్మీనారాయణ నాతరి రాజు తదితరులు పాల్గొన్నారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బానోతు జగన్ నాయక్ తెలిపారు.
