మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తోట
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి శాసనసభ, శాసనమండలి సంక్షేమ కమిటీల చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వేమ్ సురేందర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ఆశించిన విధంగా సమర్థవంతంగా పనిచేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
