seethakka| ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి

seethakka| ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి

సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు.

“తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మీరు మరిన్ని విజయాలు సాధిస్తూ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను” అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.