Visakha MP | రూ.1,500 కోట్లతో మూడు కీలక ప్రాజెక్టులు

Visakha MP | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. మొత్తం రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు తెలిపారు.

మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధికి రూ.658.61 కోట్లు కేటాయించినట్లు ఎంపీ తెలిపారు. అలాగే స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.725.18 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు.

బల్క్ అండ్ సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ కోసం మరో రూ.117.24 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో విశాఖ నగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.

Leave a Reply