అదుపు తప్పి బోల్తా పడిన ఆటో.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కాటారం (ఆంధ్రప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ–గుమ్మపల్లి రహదారిపై గురువారం ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిపిలవంచ గ్రామానికి చెందిన మేడ సాంబయ్య, ముసుగుల గోపన్న ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడటంతో సాంబయ్యకు కాలు విరగగా, గోపన్నకు నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.