US Iran Conflict | ఇరాన్‌పై అమెరికా దాడులతో మళ్లీ ఉద్రిక్తత

US Iran Conflict | ఇరాన్‌పై అమెరికా దాడులతో మళ్లీ ఉద్రిక్తత

చర్చల కంటే ఘర్షణకే ప్రాధాన్యం

ప్రపంచాన్ని కలవరపెడుతున్న యుద్ధ వాతావరణం

US Iran Conflict | ఇరాన్‌తో ఇక తాడోపేడో తేల్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతియుత మార్గాలకు ఇరాన్ కలిసి వస్తుందని ఇంతకాలం తాము చర్చలకే ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పుడు ఆ గడువు తీరిపోయిందని ఆయన బుధవారం నాడు నాటో సమ్మిట్‌లో స్పష్టం చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిందని ఆయన అన్న కొద్ది గంటల్లోనే ఇరాన్‌లోని 80 కచ్చితమైన లక్ష్యాలపై అమెరికన్ దళాలు క్షిపణులతో దాడులు చేశాయి.

ఇరాన్‌పై ట్రంప్ చాలా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఇరాన్‌తో చర్చలన్నవి సమయం వృథా అన్నారు. వాళ్లను రోగులు నడిపిస్తున్నారని, ఇరానీయన్లు హింసాత్మక నైజం కలిగిన వారని వ్యాఖ్యానించారు. అయితే, అమెరికా ప్రతినిధులు ఇరాన్ ప్రతినిధులతో మాట్లాడటానికి తాను అడ్డు చెప్పబోనని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతినిధులతో చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని కూడా అన్నారు.

మరోవైపు అమెరికా దాడులను ఇరాన్ ఖండించింది. అమెరికాకు దీటైన సమాధానం ఇస్తామని ఇరాన్ హెచ్చరించింది. హార్మూజ్ జలసంధి నిర్వహణలో బయటివారి జోక్యాన్ని సహించబోమని తీవ్రంగా హెచ్చరించింది. కాగా, అమెరికన్ దళాలు జరిపిన దాడుల్లో 28 ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయని ట్రంప్ తెలిపారు. గత ఏప్రిల్‌లో కాల్పుల విరమణ తర్వాత ఇరాన్‌పై అతి పెద్ద దాడులు జరగడం గమనార్హం.

సర్వోన్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల సమయంలో ఈ దాడులు జరగడం కూడా గమనార్హమే. ఖమేనీ అంత్యక్రియలను వీక్షించేందుకు లక్షలాది మంది హాజరై అశ్రునివాళులు అర్పించడం చూసి ట్రంప్‌కు కడుపుమంట అయిందని వ్యాసం పేర్కొంది. అందుకే ఆయన ఇరాన్‌పై దాడులు జరిపించడమే కాకుండా ఇరాన్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశారని పేర్కొంది.

ఇరాన్ జరుపుతున్న చమురు ఎగుమతులకు జీవనాడిగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని, హార్మూజ్ దిగ్బంధనాన్ని తిరిగి కొనసాగిస్తామని, అయితే అది ఇరాన్ నౌకలకే పరిమితమని స్పష్టం చేశారు. ఇరాన్‌కు నిత్యావసరాలు కూడా అందకుండా దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.

కాగా, కువైట్, బహరైన్‌లలోని 85 అమెరికన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపిందని పేర్కొన్నారు. ట్రంప్ నమ్మదగిన వ్యక్తి కాదని, ఈ విషయాన్ని తాము ముందే చెప్పామని ఇరాన్ నాయకులు వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం ఒక ఖరీదైన అమెరికన్ నౌకపై ఇరాన్ దళాలు దాడులు జరపడంతో, ఇరాన్ నౌకలపై అమెరికన్ దళాలు దాడుల పరంపరను కొనసాగిస్తున్నాయి. దీంతో యుద్ధం మళ్లీ మొదలైందని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఇరాన్‌లోని విద్యుత్ గ్రిడ్, నీటి సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తామని ట్రంప్ హెచ్చరించినట్లు వ్యాసం పేర్కొంది.