అచ్చంపేట సీఐ, ఎస్సైలను కలిసిన పబ్లిక్ క్లబ్ ప్రతినిధులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట పబ్లిక్ క్లబ్ ప్రతినిధుల బృందం బుధవారం సీఐ నాగరాజు, ఎస్సై నరేష్‌లను మర్యాదపూర్వకంగా కలిసింది. పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి ఆధ్వర్యంలో ప్రతినిధులు పోలీసు అధికారులను కలిసి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అందిస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో ప్రజా సేవా కార్యక్రమాల్లో పోలీసు శాఖతో కలిసి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ ఉపాధ్యక్షుడు కందికొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కానోజు మనోహర్ ప్రసాద్ (మన్ను పటేల్), కోశాధికారి పోకల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు కేతపల్లి వెంకటేష్, దశరథం, ముక్తాల వెంకటేష్, ఆకుల సురేష్, సభ్యులు కాలిక్, బాణాల సతీష్, కైసర్ తదితరులు పాల్గొన్నారు.
