paradise | క్లైమాక్స్‌పై కాసర్ల శ్యామ్ సంచలన వ్యాఖ్య!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ చేసిన పోస్ట్ సోసల్ మీడియాలో చర్చకు తెరలేపింది.
సినిమా క్లైమాక్స్‌ను చూసిన అనంతరం కాసర్ల శ్యామ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో Climax #Paradaise .. “Mark My Tweet” ఆపుకోలేక పెడుతున్నా … అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క మాటతోనే సినిమా క్లైమాక్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
కాసర్ల శ్యామ్ కామెంట్్స ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసులు ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటి? క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎలాంటి సన్నివేశం ఉండబోతోంది? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నాని అభిమానులు ఈ సినిమాను ఆయన కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా అభివర్ణిస్తూ భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.
నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోపై భారీ నమ్మకం..
ఇప్పటికే దసరతో దుమ్ము లేపిన వీరిద్దరి కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
“మార్క్ మై ట్వీట్” అనే ఒక్క వాక్యం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కామెంట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తూ.. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు క్లైమాక్స్ ఇండియన్ సినిమాల్లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని అంచనా వేస్తుండగా, మరికొందరు నాని కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
