ఎన్సీసీ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ చల్లిన విద్యార్థులు
మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు భాగ్యశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్సీసీ కార్యక్రమాల భాగంగా విద్యార్థులతో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణతో పాటు రహదారికి ఇరువైపులా విద్యార్థులు సీడ్ బాల్స్ చల్లి పచ్చదనం పెంపునకు తమ వంతు కృషి చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భాగ్యశ్రీ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీడ్ బాల్స్ చల్లడం వల్ల మొక్కలు సులభంగా మొలకెత్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పచ్చదనం పెరగడం ద్వారా పర్యావరణ సమతుల్యత నెలకొని, సకాలంలో వర్షాలు కురిసేందుకు దోహదపడుతుందని విద్యార్థులకు వివరించారు.
ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకన్న, సురేందర్, కళ్యాణి, అనిల్ కుమార్, రాజు, కుమారస్వామి, ప్రవీణ్, పద్మలలిత, విజయభాస్కర్, రాజయ్య, మజహర్తో పాటు సీఆర్పీలు పాల్గొన్నారు.
