కమ్యూనిస్టు విప్లవ అగ్రనేతల సంస్మరణ సభ పోస్టర్ల ఆవిష్కరణ

ఉట్నూర్ (ఆంధ్రప్రభ): భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేంద్రం (మా-లే) వ్యవస్థాపక నాయకులు అమరులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ విజయ్ శర్మ సంస్మరణ సభ పోస్టర్లను మంగళవారం పాత ఉట్నూరులో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నేతావత్ రాందాస్ మాట్లాడుతూ, ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు పాత ఉట్నూరులో సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి చూపిన విప్లవ మార్గం నేటికీ సమకాలీనంగా ఉందని, అదే మార్గంలో నడుస్తూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ విజయ్ శర్మ గత ఏడాది జూలై 12న అనారోగ్యంతో మరణించారని పేర్కొన్నారు.

ఈ సంస్మరణ సభకు కార్మికులు, రైతులు, మేధావులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా నాయకులు రాథోడ్ నాందేవ్, ఓపీడీఆర్ జిల్లా నాయకులు రాథోడ్ లాల్‌సింగ్, జాదవ్ గణేష్ మహారాజ్, ఆడే రవీందర్, ఆడే దేవరావు, రాథోడ్ బాపురావు, డీఎస్‌ఓ జిల్లా నాయకులు రాథోడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.