ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి..

జైనూర్, ఆంధ్రప్రభ : జాబ్ కార్డు ఉన్న ప్రతి ఉపాధి హామీ కూలీకి పని కల్పించాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ కోరారు.

బుధవారం జైనూర్‌లో ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న పనుల ప్రదేశాలను ఆయన సందర్శించి, కూలీలతో మాట్లాడారు. వారు నిర్వహిస్తున్న పనులను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఈజీఎస్ ఏపీవో నగేష్‌తో మాట్లాడుతూ, కూలీలతో ఉదయం పూటనే పనులు చేయించాలని సూచించారు. కూలీలకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు చల్లటి తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో నగేష్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply