కాంగ్రెస్ కడెం మండల ప్రధాన కార్యదర్శిగా ముడికే మల్లేష్ యాదవ్

కడెం (ఆంధ్రప్రభ): కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యూత్ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీ కడెం మండల ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఈ సందర్భంగా ముడికే మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి కడెం మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.