ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభోత్సవం…
- వేముల వీరేశంకు శుభాకాంక్షలు
చిట్యాల, ఆంధ్రప్రభ : నకిరేకల్ శాసనసభ్యులు, శాసనమండలి ప్రభుత్వ విప్ వేముల వీరేశం సోమవారం హైదరాబాద్‌లోని తన ప్రభుత్వ విప్ కార్యాలయం, పేషీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుద్ధుడు, చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి పాల్గొని ప్రభుత్వ విప్ వేముల వీరేశంను శాలువా, పూలబొకేతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు, కోనేటి యాదగిరి మాట్లాడుతూ, వేముల వీరేశం భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
