Hussain Sagar | హుస్సేన్‌సాగర్ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్

ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో పరిశీలన
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలపై అధికారుల తనిఖీ.. అనుమతులపై విచారణ
హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, హైదరాబాద్ కలెక్టర్ సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన
ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు నేపథ్యంలో నిర్మాణాల అనుమతులపై రికార్డుల పరిశీలన.. నివేదిక అనంతరం తదుపరి చర్యలు

Hussain Sagar | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హుస్సేన్‌సాగర్ పూర్తి ట్యాంక్ స్థాయి (ఎఫ్‌టీఎల్) పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జిల్లా యంత్రాంగం సోమవారం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా నేతృత్వంలోని అధికారుల బృందం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. ఇరిగేషన్ శాఖ నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా నిర్మాణ పనులు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనే అంశంపై విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన భవన నిర్మాణానికి తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారుల బృందం స్పష్టం చేసింది.