సీఎం మాటలు.. నీటి మూటలు: మాజీ ఎమ్మెల్యే బొల్లం
కోదాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శలు గుప్పించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ, 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవానికి దూరమని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు విషయంలో అడ్డువచ్చిన వారిని తొక్కుతామని చెప్పడం సరికాదని, రైతులను, పేదలను తొక్కుతారా అని ప్రశ్నించారు.
