కాంగ్రెస్ అసమర్థ పాలనలో వృధాగా గోదావరి నీరు
- లక్ష్య క్యూసెక్కులు సముద్రం పాలు
- కన్నెపల్లి, లక్ష్మీ పంపు హాస్ లు ప్రారంభించాలి
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో గోదావరి జలాలు వృధాగా పోతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం మెర్జీయా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టును బూచిగా చూపి లక్ష్య క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు.
కేటీఆర్ పర్యటనలో కన్నేపల్లి, లక్ష్మి పంపు హౌస్ లో వద్ద 6 ఎత్తులో గోదావరి నీరు ప్రవహిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. తక్షణమే కన్నేపల్లి, లక్ష్మి పంపు హౌస్ పంపులను ఆన్ చేసి ప్రాజెక్టులు, చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వానాకాలం రైతులకు సాగునీరు సరఫరా చేయవచ్చని తెలిపారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం విష ప్రచారం మానుకుని రైతు ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధు, తదితరులు పాల్గొన్నారు.
