రూ.30 లక్షలతో ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే తన ధ్యేయమని, విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం నిరంతరం కృషి చేస్తానని ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్ అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపూర్ మండలం అల్లందేవిచెరువు గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు తరగతి గదుల ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. సర్పంచ్ సుర్వి సౌజన్య రాజుగౌడ్ మాట్లాడుతూ, గ్రామంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి పాఠశాల భవనాన్ని నిర్మించిన భాస్కర్‌కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఉపసర్పంచ్ కవిత స్వామి, ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.