కో ఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఎం ఎస్ విజయ్ కుమార్, గుత్తా శమంతా రెడ్డి, చింతకింది మురళి, ఇంతియాజ్ ఇర్ఫానా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు నూతన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.