చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు తీర్మానాలు

చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులను విడతల వారీగా పూర్తి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధరణ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ వద్ద షెడ్డు నిర్మాణం చేయుటకు, 3, 4, 11, 12 వార్డులలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం కు, చెత్త సేకరణ కోసం మూడు స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేయాలని తీర్మానం చేశామన్నారు. అలాగే బేలింగ్ మిషన్ కొనుగోలుకు, కెపాసిటీ బిల్డింగ్ నిర్మించుటకు కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు, మున్సిపల్ కమిషనర్ ఉప్పల గురులింగం, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.