మోదీ ఆరోగ్యాల కోసం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనకు 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ బుధవారం చిట్యాల మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రధాని మోదీ దీర్ఘాయుష్షుతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రముఖ స్థానంలో నిలిపిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించాలని, మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండ సురేష్, రాయిని శ్రీనివాస్, వల్లల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply