పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..
నడిగూడెం ,ఆంధ్రప్రభ : మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నడిగూడెo మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మొక్క బిక్షపతి అన్నారు. గురువారం నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మొక్క బిక్షపతిని ఎన్నిక ఎన్నిక చేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన బిక్షపతి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తనకు మండల పార్టీ అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.2028 వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడుకి ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
