E-mail | అప్రమత్తమైన పోలీసులు
E-mail | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణ్ కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు (బాంబు స్క్వాడ్) ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేసి కార్యాలయ పరిసరాలను పరిశీలించారు.
ఈ బెదిరింపు ఈ-మెయిల్‌ను ఎవరు పంపారు? దాని వెనుక ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించినట్లు సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
