పర్యాటకులను ఆకర్షిస్తున్న తెలంగాణ మినీ నయాగారా
వాజేడు, ఆంధ్రప్రభ : పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బొగత జలపాతం అందాలను వెదజల్లుతూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. గత కొద్ది నెలలుగా బోగత జలపాతం లో నీరు లేకపోవడంతో వేలవేలబోయిన జలపాతం ఇటీవల వాజేడు మండలం ఛత్తీస్గడ్ అడవుల్లో కురిసిన వర్షాలకు వరద నీరు అత్యధికంగా జలపాతం లోకి చేరడంతో బోగతకు జలకళ ఉట్టి పడుతుంది.
చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం పక్షుల కేరింతల నడుము సుమారు 50 అడుగుల ఎత్తు నుండి వరద నీరు బొగత లోయలోకి జాలువారుతుంటే తుంపర్లు ఎగిసిపడుతూ అందాలను వెదజల్లుతుంది. ఈ బోగతా అందాలు చూడతరమా అనే విధంగా పర్యటకులను కనువిందు చేస్తున్నాయి.
బొగత అందాలకు ఆకర్షితులవుతున్న పర్యాటకులు
తెలంగాణ మినీ నయాగారా జలపాతంగా పేరు గాయించబడిన చీకుపల్లి బోగత జలపాతం అందాలకు రాష్ట్ర నలుమూలల నుండి పర్యాటకులు ఆకర్షితులై అందాలను వీక్షించడానికి వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. బోగత అందాలను వీక్షిస్తూ చక్కటి ఆహ్లాదాన్ని పొందుతున్నారు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలసి బొగత జలపాతం ప్రాంగణానికి చేరుకొని రోజతమానం ఆ ప్రాంతంలో గడుపుతూ చక్కటి వాతావరణం మధ్య ఆహ్లాదాన్ని పొందుతున్నారు. బోగత జలపాతం సందర్శించే పర్యాటకులకు అటవీశాఖ అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

