ఎస్ఐఆర్ సర్వేను పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలోని రైలుపేట వైఎస్సార్ నగర్లో బీఎల్వోలు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, జిల్లాలో సర్వే పకడ్బందీగా జరుగుతోందన్నారు. బీఎల్వోలు, అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి ప్రభావాలకు తావులేకుండా నిష్పాక్షికంగా, నిబద్ధతతో విధులు నిర్వహించి సర్వేను విజయవంతం చేయాలని సూచించారు.
అనంతరం మల్కాపట్నం సచివాలయంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో కే. సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
