టీటీడీ ట్రస్టులకు రూ.1.10 కోట్ల విరాళం

ఎస్వీ ప్రాణదానం, అన్నప్రసాదం ట్రస్టులకు లెవెన్ హోల్డింగ్స్ సంస్థ ఆర్థిక సహాయం

తిరుమల ప్రతినిధి, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌కు చెందిన లెవెన్ హోల్డింగ్స్ సంస్థ, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు రూ.1.10 కోట్ల విరాళాన్ని అందించింది.

సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో లారస్ ఫార్మా కంపెనీ సీఎఫ్‌వో వెంకట రవికుమార్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళాలకు సంబంధించిన డీడీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.