ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

రఘునాథపల్లి ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బైకాని రాజు ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బైకాని రాజు మాట్లాడుతూ.. దేశం నుంచి పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రాలకు పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.