పంట నిల్వకు భారీ ఊరట..

  • గ్రామానికి రూ.30 లక్షల గోదాం మంజూరు!

కుంటాల, ఆంధ్రప్రభ: రైతుల పండించిన పంటను ఉత్పత్తులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం గిడ్డంగుల గోదాంలను మంజూరు చేయడంతో రూ. 30 లక్షల మంజూరు కావడంతో సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ స్థానిక సర్పంచ్ సుంకారి గీత మహేందర్ కు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతుల పండించిన పంటల ఉత్పత్తుల కొరకు గోదాం మంజూరు చేసినందుకు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు సర్పంచ్ గీత మహేందర్ తో పాటు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు ఫిప్పర వెంగళరావు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.