కేఆర్ఆర్ హిల్స్ కాలనీ నూతన కమిటీ ఎన్నిక
సరూర్‌నగర్, ఆంధ్రప్రభ: సరూర్‌నగర్ మండలంలోని కేఆర్ఆర్ హిల్స్ కాలనీ నూతన కార్యవర్గాన్ని సోమవారం స్థానిక కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కాలనీవాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా లిక్కీ తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షుడిగా యారవ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంకబుడ్డి శేఖర్ యాదవ్, సహాయ కార్యదర్శిగా కృష్ణప్రసాద్ శర్మ, కోశాధికారిగా శ్రీపతి రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గోదేశ్ మల్లేష్ (ఆర్టీసీ), గిరి, చెన్నారెడ్డి, ముకుంద్ రెడ్డి, బాలాజీ రావులను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కాలనీవాసుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. కాలనీలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
