అభివృద్ధి పనులపై మంత్రి వివేక్ ఆరా

అభివృద్ధి పనులపై మంత్రి వివేక్ ఆరా
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు మున్సిపాల్టీ పరిధిలో జరుగుతున్నా అభివృద్ధి పనుల పై వార్డులవారిగా ఆరా తీశారు. గురువారం కోటపెల్లి మండలంలోని ఇందిరమ్మ లబ్ది దారుని గృహ ప్రవేశానికి హాజరైన మంత్రి వివేక్ అనంతరం చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి వార్డుల వారిగా జరుగుతున్న అభివృద్ధి పనులపై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో సైడ్ డ్రైనేజి, రోడ్ల నిర్మాణా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. రెండో విడుత ఇందిరమ్మ ఇండ్లు జూన్ మాసంలో మంజూరు కానున్నట్లు తెలిపారు. వార్డుల వారీగా కార్యకర్తలు ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
