Aadhar | యూఐడీఏఐ కీలక ప్రకటన
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆధార్ కార్డులో ఈమెయిల్ చిరునామా అప్డేట్ చేయాలనుకునే వారికి యూఐడీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఈ సేవ కోసం రూ.75 చెల్లించాల్సి ఉండగా, ఇక ఆ భారం ఉండదు. వచ్చే ఆరు నెలల పాటు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ అప్డేట్ను పూర్తిగా ఉచితంగా అందించాలని యూఐడీఏఐ నిర్ణయించింది. దీంతో లక్షలాది మంది ఆధార్ వినియోగదారులు ఎలాంటి రుసుము లేకుండానే తమ ఈమెయిల్ వివరాలను సవరించుకునే అవకాశం లభించనుంది.
అయితే వచ్చే నెల 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎలాంటి రుసుము లేకుండా ఈ మెయిల్ అప్ డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇది కేవలం యాప్ ద్వారా అప్డేట్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఆధార్‌తో మెయిల్ లింకై ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందవచ్చని చెప్పింది.
ఆధార్‌కు ఈమెయిల్ లింక్ చేసి ఉంచడం వల్ల ఆధార్‌కు సంబంధించిన తాజా అప్డేట్లు, సేవల సమాచారం, భద్రతా సూచనలు నేరుగా ఈమెయిల్ ద్వారా అందుతాయని యూఐడీఏఐ తెలిపింది. అందువల్ల ఈమెయిల్ వివరాలు లింక్ చేయని వారు లేదా పాత ఈమెయిల్ ఉపయోగిస్తున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
