విద్యాభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వల్లంపల్లి సర్పంచ్ వాణి కస్తూరి వెంకట్ రాములుఅన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని వల్లంపల్లి ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బడి ఈడు కలిగిన బడిబాటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేనందున ఒకటి, మూడు, ఐదో తరగతి విద్యార్థులు గదుల కొరత కారణంగా బయట వరండాలో చదువుతుండడంతో మూడు ఫ్యాన్లు వితరణ చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధనలతోపాటు విద్యార్థులను వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. ఈ హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
