Narsimhulapet నెహ్రూ పరిపాలన రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ

Narsimhulapet నెహ్రూ పరిపాలన రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ

  • భాజపా ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్య ప్రకాష్ వ్యాఖ్యలు

నర్సింహులపేట Narsimhulapet , ఆంధ్రప్రభ:

నెహ్రూ పరిపాలించిన 12 సంవత్సరాల రికార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించారని భాజపా ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్య ప్రకాష్ పేర్కొన్నారు.

బుధవారం నర్సింహులపేటలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘనత సాధించినందుకు రాష్ట్ర భాజపా ఎండోమెంట్ సెల్ తరఫున ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని మోదీ దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. సరిహద్దు భద్రత, సైనికులకు సర్వాధికారాలు ఇవ్వడం వంటి నిర్ణయాలు దేశ రక్షణను బలోపేతం చేశాయని పేర్కొన్నారు.

అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి చారిత్రక నిర్ణయాలు మోదీ పాలనలో సాధ్యమయ్యాయని తెలిపారు. అలాగే కాశీలోని అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని విదేశాలకు తరలించిన తర్వాత పట్టుదలతో తిరిగి భారతదేశానికి తీసుకువచ్చి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి సహకారంతో కాశీలో మళ్లీ ప్రతిష్టించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ సంయుక్త కార్యదర్శులు మణిదీప్, దేవి ప్రసాద్, సోషల్ మీడియా ఇన్చార్జి షణ్ముఖ్, జిల్లా కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply