అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు యాజమాన్య హక్కులు ..

దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం తో సాకారం…
టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు గుర్రం కొండ..

భవానిపురం, ఆంధ్ర‌ప్ర‌భ : దశాబ్దాలుగా కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్ల పట్టాల విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు గుర్రం కొండ అన్నారు. జీ వో నెంబర్ 30 ప్రకారం కొండ పోరంబోకు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సోమవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ లో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్లు, కూటమినేతలతో కలిసి టీడీపీ రాష్ట్ర నాయకుడు గుర్రం కొండ వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పథకం కింద కూటమి ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజలకు పింఛన్లను అందిస్తుందన్నారు. దశాబ్దాలుగా కొండ ప్రాంతంలో నివసిస్తున్న పేదల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసిందని తెలిపారు.అర్హులైన లబ్ధిదారులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు.

కష్టాల్లో ఉన్నవారికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం అండగా నిలుస్తుందని తెలిపారు.ఎమ్మెల్యే సుజనా చౌదరి, “సుజనా ఫౌండేషన్” ద్వారా విద్యా, వైద్యం , ఆరోగ్య రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారని కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తూ పేదలకు అండగా నిలబడ్డారన్నారు.ఎమ్మెల్యే సుజనా చౌదరి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ,సంక్షేమ సూచికలో రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలిచిందని గుర్రంకొండ తెలిపారు..

సమస్యల పరిష్కారం కోసమే..

ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ కోరారు.ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరించారు. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు.. సామాజిక పెన్షన్లు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు, నూతన ఇంటికొరకు దరఖాస్తులు, తాగునీటి ఇబ్బందులు, వైద్యం సాయం తదితర అంశాలపై వినతులు అందాయని కూటమి నేతలు పేర్కొన్నారు.

46 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పోతినిడిలోకేష్, 46 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బాదర్ల శివ, మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్,మహ్మద్ అబ్దుల్ ఖాదర్, నాగోతి రామారావు ,టీడీపీ మైనార్టీ మోర్చా జిల్లా సెక్రటరీ షేక్ కరిముల్లా, 38 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సురభి బాలు, జనసేన నేత బొల్లేపల్లి కోటేశ్వరరావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..