ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
- సర్పంచ్ చంద్రశేఖర్ గుప్త
కడెం, ఆంధ్రప్రభ : ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్త కోరారు.
సోమవారం కడెం మండలంలోని ఉడుంపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం నర్సరీ నుంచే ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యను అందిస్తోందని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉడుంపూర్ ఎంపీయూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్, ఉపసర్పంచ్ నాగవత్ సరిత-ప్రభాకర్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్, వార్డు సభ్యులు, సీఆర్పీ సోలమన్ నాయక్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
