అటవీ మార్గాల్లో 30 కి.మీ వేగ పరిమితి తప్పనిసరి
అటవీ మార్గాల్లో 30 కి.మీ వేగ పరిమితి తప్పనిసరి
- ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరెడ్డి
కడెం, ఆంధ్రప్రభ : ఖానాపూర్ డివిజన్ పరిధిలో అటవీ మార్గం ద్వారా ప్రయాణించే అన్ని రకాల వాహనదారులు అభయారణ్యం మరియు టైగర్ రిజర్వ్ నిబంధనల ప్రకారం గంటకు గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగ పరిమితిని కచ్చితంగా పాటించాలని ఉడుంపూర్ ఎఫ్‌ఆర్‌వో జి. శ్రీనివాసరెడ్డి సూచించారు.
అడవి దున్నలు, దుప్పులు, జింకలు తదితర వన్యప్రాణులు తరచుగా రోడ్లు దాటే ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వేగ నియంత్రణ కోసం భారీ కేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఈ మార్గాల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తూ వేగ పరిమితిని మించకుండా ఉండాలని కోరారు.
వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎఫ్‌ఆర్‌వో సూచించారు.
