విగ్రహాన్ని యధాస్థలంలోనే ఉంచాలి…
విగ్రహాన్ని యధాస్థలంలోనే ఉంచాలి…
- కాలనీవాసుల డిమాండ్..
ధర్మసాగర్, ఆంధ్రప్రభ : ధర్మసాగర్ గ్రామంలోని నెహ్రూ కాలనీలో సుమారు 50 ఏళ్లుగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని యథాస్థానంలోనే ఉంచాలని సోమవారం కాలనీవాసులు తహసీల్దార్ , గ్రామ కార్యదర్శులకు వినతిపత్రం సమర్పించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన విగ్రహం దశాబ్దాలుగా కాలనీలో ఉందన్నారు. ఇటీవల విగ్రహం సమీపంలోని స్థలాన్ని కొనుగోలు చేసిన ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టడంతో, విగ్రహాన్ని ప్రస్తుత స్థలం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా కాలనీలో నిర్మించబోయే డ్రైనేజీ పనులకు అనుగుణంగా విగ్రహాన్ని తమకు ఇష్టానుసారం మార్చాలని కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అయితే విగ్రహం తరలింపుపై కాలనీవాసులు వ్యతిరేకంగా ఉన్నారని, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహాన్ని యథాతథంగా కొనసాగించాలని వారు కోరుతూ వినతి పత్రాన్ని తహసీల్దార్ ఇస్లావత్ భావ్ సింగ్ గ్రామ కార్యదర్శి ప్రవీణ్ లకు లిఖితపూర్వకంగా అందించారు. , విగ్రహం తరలింపును అడ్డుకోవాలని అందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
