Tragic incident | ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులు

Tragic incident | ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులు

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా పోలవరంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బావిలో పూడికతీత పనులు నిర్వహించేందుకు దిగిన ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, బావిలో పేరుకుపోయిన పూడికను తొలగించే పనిలో భాగంగా ఇద్దరు వ్యక్తులు లోపలికి దిగారు. అయితే బావిలో విషవాయువులు లేదా ఆక్సిజన్ కొరత కారణంగా వారు అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను పోలవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.