30-Solver-Gang : వామ్మో నీటుగా,,, Andhra Prabha Top News

30-Solver-Gang : వామ్మో నీటుగా,,, Andhra Prabha Top News

  • అడ్డదారిలో..
  • కొసరు గ్యాంగ్​ దొరికారు
  • 30 మంది సాల్వరు ముఠా పట్టివేత
  • లింకుల కోసం అధికారుల జల్లెడ
  • బీహార్​ లో నీట్​ ఎగ్జామ్​ అలజడి

( ఆంధ్రప్రభ, పాట్నా ప్రతినిధి)

జాతీయ స్థాయిలో అలజడి సృష్టించిన నీట్​ పేపర్​ లీకేజీ… మరో సారి తెరమీదకు వచ్చంది. అయితే.. ఈ సారి పేపర్​ లీకేజీ కాకుండా… అసలు అభ్యర్థి పేరిట కొసరు రాతగాళ్లు.. పరీక్ష కేంద్రం అడ్డంగా దొరికారు. కానీ ఇక్కడ కూడా అధికారులను ఏమార్చే ప్రయత్నం జరిగినా.. బీహార్​ లఖినయ జిల్లా కలెక్టర్​, జిల్లా ఎస్పీ వీరి ఆటలు సాగనీయలేదు. తాజాగా ఈ సాల్వర్​ గ్యాంగ్​ లింకుల్ని వెలుగులోకి తీసుకు వస్తున్నారు. ఇక నీట్​ పరీక్ష అంటేనే.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.

30-Solver-Gang : ఈ ​ బాగోతం ఏమిటీ?

బీహార్‌లో NEET UG రీ-ఎగ్జామినేషన్ లోరే భారీ కుట్ర కకావికలం చేసింది. లఖిసరాయ్ జిల్లాలో సాల్వర్ గ్యాంగ్ బాగోతం బయటపడింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ డమ్మీ గ్యాంగ్​ దొరికి పోయింది. అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాయడానికి వచ్చిన డమ్మీ అభ్యర్థుల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ మ్యాచ్ కాలేదు. సాధారణంగా బయోమెట్రిక్ మ్యాచ్ కాకపోతే సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేయాలి. కానీ, పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీ సిబ్బంది సాల్వర్ గ్యాంగ్‌తో కుమ్మక్కయ్యారు. డబ్బులు తీసుకుని, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను తారుమారు చేసి నకిలీ అభ్యర్థులను లోపలికి అనుమతించారు. అయితే, అక్కడి గట్టి నిఘా, అధికారుల తనిఖీల్లో ఈ తారుమారు కథ వెలుగులోకి వచ్చింది.

30-Solver-Gang : 30 మంది పట్టివేత

హసన్​ పూర్​ హైస్కూల్​, కేంద్రీయ విద్యాలయంలో నిఘా అధికారలుఉ దాడులు చేసి మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. అసలు విద్యార్థుల బదులు పరీక్ష రాయడానికి వచ్చిన 9 మంది ప్రాక్సీ (డమ్మీ) అభ్యర్థులను అరెస్ట్ చేశారు. పాట్నా మెడికల్ కాలేజీ రాయ్‌బరేలీ ఎయిమ్స్​ , బనారస్ హిందూ యూనివర్సిటీ తదితన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన ఐదుగురు వైద్య విద్యార్థులు సాల్వర్లుగా వ్యవహరించారు. ఇక 14 మంది సాల్వర్ గ్యాంగ్‌తో చేతులు కలిపిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఏజెన్సీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన ఏడుగురు నెట్‌వర్క్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

30-Solver-Gang : పాతనేరగాడే.. మాస్టర్

ఈ మొత్తం నెట్‌వర్క్‌ను ప్రధాన సూత్రధారి అర్పిత్ రాజ్ నడిపించినట్టు అధికారులు గుర్తించారు. .ఈ అర్పిత్ రాజ్ గయ లోని అనుగ్రహ నారాయణ్ మగధ మెడికల్ కాలేజీ ) విద్యార్థి. 2024 NEET పేపర్ లీక్ కేసులో కూడా అర్పిత్ రాజ్‌ను CBI అధికారులు విచారించారు. ఆ పాత నేరస్థుడే మళ్లీ కొత్తగా ఈ బయోమెట్రిక్ లూప్‌హోల్‌ను వాడుకుని నెట్‌వర్క్ నడిపించాడు రూ. 30 నుండి 40 లక్షల డీల్మెరిట్ ఉన్న వైద్య విద్యార్థులను ప్రాక్సీలుగా కూర్చోబెట్టడానికి సాల్వర్ గ్యాంగ్ ఒక్కో అభ్యర్థి కుటుంబం నుండి రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు వసూలు చేసింది. అందులో కొంత వాటాను బయోమెట్రిక్ సిబ్బందికి లంచంగా ఇచ్చేందుకు డీల్​ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణా కుమార్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలు ఈ ముఠాకు సంబంధించిన ఇతర లింకులపై బీహార్ వ్యాప్తంగా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నాయి.