నోటు పుస్తకాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే సునీత
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. జైన్ ట్రస్ట్ వారి శ్రీ అజిత్ పార్శ్వ యువ సంఘటన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జైన్ ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆమె విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు నోట్ పుస్తకాలు, విద్యా సామగ్రి ఎంతో అవసరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న జైన్ ట్రస్ట్ ప్రతినిధులను ఆమె ప్రశంసించారు. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. జైన్ ట్రస్ట్ ప్రతినిధులు, శ్రీ అజిత్ పార్శ్వ యువ సంఘటన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
