Toxic | మాస్ రాజాకి ఇబ్బందే..
Toxic | మాస్ రాజాకి ఇబ్బందే..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ టాక్సిక్. కేజీఎఫ్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మూవీకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. ఈ మూవీ ఎప్పుడో మార్చిలో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు రిలీజ్ కాలేదు. జూన్ లో వస్తుందని ప్రకటించారు. ఆతర్వాత పోస్ట్ పోన్ అని అనౌన్స్ చేశారు కానీ.. రిలీజ్ డేట్ చెప్పలేదు. రీసెంట్ గా సంక్రాంతికి రానున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు టాక్సిక్ మేకర్స్ షాక్ ఇచ్చారు. ఇంతకీ.. టాక్సిక్ వచ్చేది ఎప్పుడు..?

Toxic |టాక్సిక్ గ్లింప్స్ పై విమర్శలు..
కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ సాధించడంతో.. హీరో యశ్ కు భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్స్ తో చేస్తాడనుకుంటే.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో చేయడానికి ఓకే చెప్పి సర్ ఫ్రైజ్ చేశారు. ఆమధ్య ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే.. పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యింది. బోల్డ్ సీన్స్ ఉన్నాయి అంటూ విమర్శలు వచ్చాయి. కొన్ని సీన్స్ రీషూట్ చేసారని వార్తలు వచ్చాయి కానీ.. మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరగడంతో అప్పటి వరుకు ఆగాలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు నెటిజన్లు.

Toxic |ఆగష్టు 26న టాక్సిక్..
ఇదిలా ఉంటే.. ఊహించని విధంగా టాక్సిక్ మూవీని ఆగష్టు 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆగష్టు 21న మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మూవీని రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి శివ నిర్వాణ డైరెక్టర్. తండ్రీ – కూతురు అనుబంధం నేపధ్యంలో రూపొందిన ఈ మూవీ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. సినిమా పై ఆడియన్స్ లో మరింతగా ఆసక్తి క్రియేట్ చేసింది. అయితే.. ఇప్పడు టాక్సిక్ ఆగష్టు 26న రిలీజ్ కావడం అంటే.. ఇరుముడి సినిమాకి కాస్త ఇబ్బందే అనే టాక్ వినిపిస్తోంది. ఇరుముడి ఆగష్టు 21న, టాక్సిక్ ఆగష్టు 26న వస్తే.. టాక్సిక్ క్రేజ్ ను దాటుకుని ఇరుముడి ఎంత వరుకు మెప్పిస్తుందో.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

