అంగన్వాడీ చిన్నారులకు ఉచిత దుస్తుల పంపిణీ..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీంగల్ మండల పరిధిలోని ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం గ్రామ సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారుల విద్యాభివృద్ధి, ఆరోగ్యం కోసం గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు దుస్తులు అందజేసి వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అజయ్ గౌడ్, అంగన్వాడీ టీచర్లు పుష్ప, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఉచిత దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్‌కు తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
