ఎండల్లో కూల్ కూల్…

ఎండల్లో కూల్ కూల్…

  • ఎండ తీవ్రత పెరగడంతో కూలర్, ఏసీలకు పెరిగిన గిరాకీ,
  • రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతో ప్రజలు పరేషాన్,
  • ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ తీవ్రత వేడి,
  • వేడి గాలులతో ఆరోగ్య సమస్యలు జాగ్రత్త డాక్టర్ల సూచన,
  • ఎండ భయంతో ఇంట్లో నుంచి కాలు పెట్టాలంటే భయం, భయం,
  • అన్ని సదుపాయాలతో అందుబాటులోకి కూలర్ లు,
  • డబ్బులు ఉంటే ఇంట్లో ఏసీలు పెట్టుకుంటున్న ప్రజలు,

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ప్రజలు బిక్కిరి అవుతున్నారు. ఉదయం ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటే భయం భయం,ఎక్కడికైనా వెళ్లాలన్న ఏమంటారా బాబు అనే ముచ్చటగా మారింది గత కొన్ని రోజుల ఎండ తీవ్రత మరింత పెరగడంతో ఇంటింటికి జనాలు కూలర్ అవసరం గా ఏర్పడింది కొందరు కూలర్ కొనేందుకు పరుగులు పెడుతున్నారు డబ్బులు ఉన్నవారు ఏసి కొంటున్నారు ఆర్థిక పరిస్థితి మధ్యతరగతి ప్రజలు కూలర్ కొనుగోలు చేయక తప్పడం లేదు…

రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత ఒక్కరి బిక్కిరి అవుతున్న జనాలు ఒకవైపు ఎండ మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. కూలర్లు ఏసీలు కొనుగోలు చేసేవారు తమ అవసరాలకు తగ్గినట్టుగా కూలర్ లను మూడు, నాలుగు రకాల విక్రయిస్తున్నారు. పర్చనల్ కూలర్ (చిన్నది), టవర్ కూలర్ (మధ్యస్తం), డీసార్ట్ కూలర్ (హైస్పీడ్) వివిధ రకాల కూలర్లను విక్రయిస్తున్నారు. బ్రాండ్లో పాటు మోటర్ టైపును గమ నించి నాణ్యతగల కూలర్ లను ఎంచుకోవడం మేలు…

కూలర్ వ్యాపారులకు పెరిగిన గిరాకీ

కూలర్ల తయారీదారులకు, విక్రయ దారులకు గిరాకీ ఏర్పడింది. మార్కె ట్ లో రూ.2500నుండి సుమారు 10000 వరకు కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర బ్రాండెడ్ కంపెనీ కూలర్ల ధర

అధికంగానే కూలర్ రేట్లు.

గతేడాదితో పోలిస్తే ఈ సారి కూలర్ ధరలు రూ.500-700 వరకు పెరిగాయి. ఐరన్ పదిశాతం, పీవీసీ ధరలు 25శాతం పెరగడంతో వినియోగదారు లపై అదనపు భారం పడుతుందంటున్న వ్యాపారులు…

పాత కూలర్ లకు రిపేర్ పెరగడంతో మరికొంత మందికి ఉపాధి..

వేసవికాలంలో మూడు నెలల పాటు వ్యాపారం కొనసాగుతుంది. నూతన కూలర్ల కొనుగోలుతో పాటు పాత కూలర్ లకు రిపేర్ పని పెరగడంతో మోటర్ల బిగింపు, గడ్డి మార్పు, తో, ఎలక్ట్రిషన్ లకు, కూలర్ దుకాణాల్లో పనిచేసేవారికి చేతినిండా పని లభిస్తోంది.

ఎండ తీవ్రత ఎక్కువగా కావడంతో ప్రస్తుతం సీజన్ సక్సెస్ గా ఉంది..

ప్రస్తుత సీజన్ కూలర్ విక్రయానికి భాగానే ఉంది. గతేడాదితో పోలిస్తే కొద్దిమేరకు ధరలు పెరిగాయి. సైజును బట్టి ధర ఉంటుంది. వేసవి కాలంలో మాత్రమే గిరాకి ఉంటాయి. కొత్త కూలర్ల విక్రయంతో పాటు పాత కూలర్లు రిపేరింగ్, సర్వీసింగ్ కూడా చేస్తున్నాం…

Leave a Reply